మొండేపులంక భజన సమాజం మా గ్రామంలోని ఒక భక్తి పరమైన మరియు సంప్రదాయ పరమైన సంఘం. ప్రతి సంవత్సరము భజనలు, హరినామ సప్తాహాలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రామ ప్రజలలో భక్తి భావాన్ని పెంపొందించడం ప్రధాన ఉద్దేశ్యం.
మా గ్రామంలోని మహిళలు, యువత మరియు పిల్లలు అందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని భజనల ద్వారా భగవంతుని కీర్తన చేస్తున్నారు. ఈ సమాజం గ్రామ ఐక్యతకు మరియు భక్తి మార్గానికి ఒక చిహ్నం.
ఈ వీడియోలలో మీరు చూడగలిగే విధంగా, మా గ్రామంలోని భజన సమాజం ఎంతో ఉత్సాహంగా, భక్తి పరవశంతో పాడిన పాటలు మరియు నృత్యాలు మనసును మాయ చేసేలా ఉంటాయి.